గాజా స్ట్రిప్‌ పై వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయిల్‌ సైన్యం

- April 07, 2023 , by Maagulf
గాజా స్ట్రిప్‌ పై వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయిల్‌ సైన్యం

జెరూసలేం: ఇజ్రాయెల్‌ సైన్యం లెబనాన్‌ పై వైమానిక దాడికి దిగింది.ప్రస్తుతం లెబనాన్‌ పై దాడి చేపడుతున్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది.దక్షిణ ఓడరేవు నగరమైన టైర్‌లోని శరణార్థి శిబిరం సమీపంలో పేలుళ్లు జరిగినట్లు లెబనాన్‌ మీడియా కూడా ధ్రువీకరించింది.గురువారం అర్ధరాత్రి పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది.లెబనాన్‌ నుంచి హమాస్‌ తీవ్రవాదులు తమ దేశంపై రాకెట్లతో దాడులకు పాల్పడంతోనే తాము వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది.

జెరూసలెంలోని అల్‌-అక్సా మసీదులో పాలస్తీయన్లపై ఇజ్రాయెల్‌ పోలీసులు రబ్బరు పూత పూసిన ఇనుప బుల్లెట్లు, గ్రెనేడ్‌లతో దాడికి దిగన సంగతి తెలిసిందే.అనంతరం ఈ దాడులు జరగడం గమనార్హం.లెబనాన్‌ భూభాగం నుంచి 34 రాకెట్లతో తమ దేశంపైకి దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.అయితే వాటిలో 25 రాకెట్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని, మరో ఐదు ఇజ్రాయెల్‌ భూభాగంలో పడినట్లు పేర్కొంది.  హమాస్‌ చర్యకు ప్రతిస్పందనగా వారికి చెందిన రెండు సొరంగాలు, రెండు ఆయుధ తయారీ స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది.బాధ్యులు తగిన మూల్యం చెల్లించుకుంటారని లెబనాన్‌ చర్యలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే గాజా స్ట్రిప్‌పై దాడులు జరగడం గమనార్హం.అయితే లెబనాన్‌ లేదా గాజాలో ప్రాణనష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com