మూడు నెలల్లో 9,000 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- April 07, 2023
కువైట్ : క్రిమినల్ కేసులు, దుష్ప్రవర్తన కేసులలో ప్రమేయం ఉన్నందున ప్రస్తుత సంవత్సరంలో మార్చి చివరి వరకు వివిధ దేశాలకు చెందిన 9,000 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. బహిష్కరణ వేటు పడిన వారిలో దాదాపు 4,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరణకు గురైన వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ఫిలిపినో కమ్యూనిటీ, శ్రీలంక, ఈజిప్షియన్ జాతీయులు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. దాదాపు 700 మంది పురుషులు, మహిళలు ప్రస్తుతం డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారని, వారి విధానాలను పూర్తి చేసిన తర్వాత వచ్చే 10 రోజుల్లో వారి స్వదేశాలకు పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల కారణంగా బహిష్కరణ రేటులో పెరుగుదల నమోదుకాగా, గడువు ముగిసిన రెసిడెన్సీ, కార్మిక చట్ట ఉల్లంఘన కారణంగా బహిష్కరణ రెండవ స్థానంలో ఉందని సదరు ననివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!