ఈద్ అల్ ఫితర్: ఫ్లైదుబాయ్ ప్రత్యేక విమాన ప్యాకేజీలు
- April 08, 2023
యూఏఈ: దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్ రాబోయే ఈద్ అల్ ఫితర్ సెలవుల కోసం యూఏఈ నుండి ప్రయాణించే ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఛార్జీలను ప్రకటించింది. ఏప్రిల్ 15, ఏప్రిల్ 23 మధ్య ట్రిప్‌ల కోసం 20 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ప్రోమో రేట్లను విడుదల చేసింది. ప్రత్యేక ఈద్ రిటర్న్ ఛార్జీలు Dh1,135 నుండి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 20లోపు బుకింగ్ చేసుకునే వారికి ఈ ప్రత్యేక ఛార్జీలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రమోషన్లో భాగమైన గమ్యస్థానాలలో ఇస్తాంబుల్, క్రాబీ, మిలన్-బెర్గామో, పట్టాయా, పిసా, సలాలా, సాల్జ్‌బర్గ్, టిబిలిసి ఉన్నాయి. అలాగే బ్లూ మస్జీదు, ఇస్తాంబుల్, టర్కీ, లేక్ కోమో, మిలన్, ఇటలీలోని మెనాగియో పట్టణం, క్రాబి, థాయిలాండ్ ఉన్నాయి. తమ నెట్‌వర్క్‌లో ఉన్న 110 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ప్రయాణీకులు బిజినెస్ లేదా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదించవచ్చని ఫ్లైదుబాయ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







