ఈద్ అల్ ఫితర్: దుబాయ్‌కి తరలివస్తున్న ఇండియన్స్..!
- April 08, 2023
దుబాయ్: కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు తగ్గిన అంతర్జాతీయ ప్రయాణం తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ప్రత్యేకించి దుబాయ్ 2022లో 14.36 మిలియన్లకు పైగా ఓవర్‌నైట్ టూరిస్ట్‌లను స్వాగతించింది. అంతకుముందు సంవత్సరంలో కేవలం 7.28 మిలియన్ల సందర్శకులు మాత్రమే దుబాయ్ వచ్చారు. జనవరి 2023లో ఎమిరేట్ 1.47 మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించింది. ఇందులో అత్యధిక భాగం భారతదేశం నుండి వచ్చిన వారే ఉన్నారు. దుబాయ్.. సంవత్సరాలుగా పర్యాటకం, షాపింగ్ కోసం భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది. ఈద్ అల్ ఫితర్ సెలవులు రానున్నందున, దుబాయ్-ఇండియా మార్గంలో సాధారణం కంటే రద్దీ పెరుగుతుందని ట్రావెల్ ఆపరేటర్లు అంచనా వేస్తున్నారు. భారతదేశం నుంచి దుబాయ్ మధ్య 80కి పైగా నాన్‌స్టాప్ రోజువారీ విమాన సర్వీసులు నడుస్తున్నట్లు వారు తెలిపారు. భారతదేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, తిరువనంతపురం, కోజికోడ్, లక్నో, మంగళూరు, తిరుచిరాపల్లి, కన్నూర్, అమృత్సర్, మధురై, జైపూర్, పూణే, గోవా, చండీగఢ్, ఇండోర్, వారణాసి వంటి నగరాల నుండి షార్జా, దుబాయ్ లకు నాన్‌స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా భారతీయ నగరాల నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, విస్తారా, గో ఫస్ట్, స్పైస్‌జెట్, ఎమిరేట్స్ , ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భారత దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుండి దుబాయ్‌కి నేరుగా విమాన మార్గాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







