రమదాన్: ఆకట్టుకుంటున్న దుబాయ్ రిఫ్లెక్షన్స్ షో

- April 10, 2023 , by Maagulf
రమదాన్: ఆకట్టుకుంటున్న దుబాయ్ రిఫ్లెక్షన్స్ షో

దుబాయ్: రమదాన్ మాసాన్ని పురస్కరించుకొని అల్ సీఫ్‌లో నిర్వహిస్తున్న దుబాయ్ రిఫ్లెక్షన్స్ షో సందర్శకులను ఆకట్టుకుంటుంది.  మార్చి 23న ప్రారంభమైన ఈ షో.. ఏప్రిల్ 22 వరకు కొనసాగనుంది.  అల్ సీఫ్ పరిసరాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.  ఈ చారిత్రక పరిసరాలు రమదాన్ వేడుకల్లో భాగంగా అందమైన లైట్లు, ప్రదర్శనలు, అద్భుతమైన వినోదం, మరేన్నో ఆకర్షణలు సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. దుబాయ్ క్రీక్ జలాలపై ఉన్న రెండు బోట్ల ద్వారా రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఐదు నిమిషాల బాణసంచా ప్రదర్శన సందర్శకులను కట్టిపడేసింది.  అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, ఐస్ క్రీమ్ స్టాల్స్, రెస్టారెంట్లు సందర్శకులకు భారీ డీల్స్ అందిస్తున్నాయి.  ముఖ్యంగా దీరా క్రీక్, అల్ సీఫ్ ల నుంచి సందర్శకులు అధికంగా తరలివస్తున్నారు. అల్ సీఫ్‌ను సందర్శించాలనుకునే వారు 1,001 లాంతర్ల మార్గాన్ని అనుసరించి, రమదాన్ దుబాయ్ రిఫ్లెక్షన్స్ షోను రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ధో డెక్, స్టార్‌బక్స్ ప్రాంతాల నుంచి ప్రత్యక్షంగా తిలకించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com