బీసీసీఐ కీలక నిర్ణయం..
- April 10, 2023
న్యూ ఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.విదేశీ పర్యటనల్లో ఆఫీస్ బేరర్లకు చెల్లించే రోజువారీ భత్యాన్ని పెంచింది.అంతేకాదు వీరు ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది.ఆదివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.తాజాగా నిర్ణయం తీసుకున్నప్పటికీ గత అక్టోబర్ నుంచే ఈ అలవెన్సులు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
దాదాపు ఏడు సంవత్సరాల తరువాత రోజువారీ భత్యంలో మార్పులు చేశారు. ఇంతక ముందు వరకు ఆఫీసర్ బేరర్లు విదేశీ పర్యటన సమయంలో రోజువారి భత్యం కింద 750 డాలర్లు పొందగా ఇప్పుడు దాన్ని 1000 డాలర్లకు పెరిగింది. దేశంలో జరిగే సమావేశాలకు, బిజినెస్ క్లాస్ ప్రయాణానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీతో సహా ఆఫీస్ బేరర్లకు రోజుకు రూ.40వేల వరకు అర్హులు.
వర్క్ ట్రావెల్ కోసం రోజుకు రూ.30వేలు చెల్లిస్తారు. వీరు దేశీయ, విదేశీ పర్యటనలలో సూట్ రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చైర్మన్‌కు కూడా ఆఫీస్ బేరర్స్ అలవెన్సులే వర్తించనున్నాయి.
పురుషులు, మహిళలు రెండు జాతీయ జట్లకు ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసే క్రికెట్ సలహా కమిటీలోని ముగ్గురు సభ్యులకు సమావేశాల కోసం ఒక్కొక్కరికి రూ. 3.5 లక్షలు చెల్లిస్తారు. వీరు విదేశీ ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ.. ఒకవేళ వెళితే మాత్రం రోజుకు 400 డాలర్లు చెల్లించనున్నారు.బీసీసీఐ సీఈఓ విదేశీ పర్యటనకు వెళితే రోజుకు 650 డాలర్లు, స్వదేశంలో అయితే రోజుకు రూ.15వేలు భత్యంగా పొందనున్నారు.
తాజా వార్తలు
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..









