‘విరూపాక్ష’తో సాయి ధరమ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా.?
- April 11, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’. నేటి ట్రెండ్‌కి దూరంగా, మూఢ నమ్మకాలు, చేత బడుల నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో రూపొందుతోన్న సినిమానే ‘విరూపాక్ష’.
ఆల్రెడీ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్లు. ట్రైలర్ కూడా ఇంటెన్సింగ్‌గా వుంది. సాయి ధరమ్ తేజ్ కొత్తగా కనిపిస్తున్నాడు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా వుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగిన కొన్ని నమ్మకాల ఆసరాగా తెరకెక్కిన చిత్రమిది.
వర్కవుట్ అయితే తేజు నయా ట్రెండ్ సృష్టించినట్లే. లేదంటే, ఇదో పెద్ద టాస్కే అవుతుంది సాయి ధరమ్ తేజ్‌కి. ట్రైలర్ అయితే బాగా కట్ చేశారు. ఆధ్యంతం ఆసక్తిగా వుంది. మూఢ నమ్మకం నుంచి ఓ ఊరిని కాపాడేందుకు వచ్చిన ‘విరూపాక్ష’గా తేజు నటించాడు.
సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. కార్తిక్ దండు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతుండగా, సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం ఈ సినిమాకి మరో ప్లస్. చూడాలి మరి, తేజు రిస్క్ ఫలిస్తుందో లేదో.!
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









