విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై జగన్‌ సమాధానం చెప్పాలి: ఏపీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు

- April 11, 2023 , by Maagulf
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై జగన్‌ సమాధానం చెప్పాలి: ఏపీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు

అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించిన విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదాన్ని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ తీసుకొస్తుందన్నారు. త్వరలో రాహుల్‌ గాంధీ విశాఖలో పర్యటిస్తారని గిడుగు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.మీడియా సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com