సోషల్ మీడియా దుర్వినియోగం.. Dh1 మిలియన్ వరకు జరిమానా

- April 12, 2023 , by Maagulf
సోషల్ మీడియా దుర్వినియోగం.. Dh1 మిలియన్ వరకు జరిమానా

యూఏఈ: ఇటీవల సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే, యూఏఈలో రూమర్‌లు, సైబర్‌క్రైమ్‌లను ఎదుర్కోవడంపై 2021 ఫెడరల్ డిక్రీ లా నంబర్ 34 ('యూఏఈ సైబర్ క్రైమ్ లా') నిబంధనల ప్రకారం.. తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. యూఏఈలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి సంబంధించి స్థానిక అధికారులు, యూఏఈ సైబర్ క్రైమ్ చట్టంలోని నిబంధనలను అందరూ కట్టుబడి ఉండాలి.

•ఇస్లాం లేదా మరేదైనా గుర్తింపు పొందిన మతాలను కించపరిచే అవమానకరమైన లేదా అభ్యంతరకరమైన పోస్ట్‌లు చేయడం నేరం. యూఏఈ  సైబర్ క్రైమ్ చట్టంలోని ఆర్టికల్ 37 ప్రకారం, ఇటువంటి నేరాలకు ఏడేళ్ల వరకు జైలుశిక్ష , Dh250,000 నుండి Dh1 మిలియన్ వరకు జరిమానాలు విధించవచ్చు.

•మానవ అక్రమ రవాణా, అశ్లీలత, వ్యభిచారం, ప్రజా నైతికతకు వ్యతిరేకంగా చర్యలు వంటి మహిళలు లేదా పిల్లలకు హాని కలిగించే కంటెంట్‌ను పోస్ట్ చేస్తే.. యూఏఈ సైబర్ క్రైమ్ చట్టంలోని ఆర్టికల్ 32 నుండి ఆర్టికల్ 34 వరకు, అటువంటి నేరాలకు ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, Dh250,000 నుండి Dh 1 మిలియన్ వరకు జరిమానాలు విధించవచ్చు.

 

•ప్రభుత్వం లేదా ప్రభుత్వ విభాగాలు, పాలక పాలన, చిహ్నాలు, యూఏఈ రాజకీయ వ్యవస్థ, ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేసిన పక్షంలో యూఏఈ సైబర్ క్రైమ్ చట్టంలోని ఆర్టికల్ 20 నుండి ఆర్టికల్ 28 వరకు ఉన్న నిబంధనల ప్రకారం, ఇటువంటి నేరాలు చాలా తీవ్రమైనవిగా భావించి శిక్షలు విధిస్తారు.

•ఒకరి గోప్యత, వ్యక్తిగత జీవితంపై దాడి చేసే ఫోటోగ్రాఫ్, వీడియోలు లేదా వ్యాఖ్యలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేయవద్దు. యూఏఈ  సైబర్ క్రైమ్ చట్టంలోని ఆర్టికల్ 44ని అనుసరించి పోస్ట్ చేసిన వారికి కనీసం ఆరు నెలల జైలుశిక్ష, Dh150,000 నుండి Dh500,000 వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.

•యూఏఈ  సంస్కృతి, వారసత్వం, పుకార్లు, తప్పుడు వార్తలకు వ్యతిరేకంగా... ప్రభుత్వం లేదా నేర పరిశోధనలకు సంబంధించిన గోప్యమైన విషయాలను లేదా ప్రస్తుత చట్టాలు మరియు ప్రజా నైతికతలను ఉల్లంఘించే ప్రకటనలను బహిర్గతం చేయడం తీవ్రమైన నేరం.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉండాలనుకుంటే.. చెల్లింపు ప్రకటనలను ఆమోదించాలనుకుంటే, నేషనల్ మీడియా కౌన్సిల్ లేదా యూఏఈలోని ఏదైనా ఇతర సమర్థ అధికారం నుండి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com