వాట్సాప్‌ యూజర్లు ఇకపై ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో లాగిన్ కావొచ్చు..

- April 12, 2023 , by Maagulf
వాట్సాప్‌ యూజర్లు ఇకపై ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో లాగిన్ కావొచ్చు..

ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కంపానియన్ మోడ్ ఫీచర్ సాయంతో వాట్సాప్ యూజర్లు తమ మెసేజింగ్ యాప్‌ను ఒకేసారి నాలుగు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో ఉపయోగించవచ్చు. ప్రస్తుత సెటప్ వాట్సాప్ యూజర్లను డెస్క్‌టాప్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్‌కు ఒకేసారి లాగిన్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, త్వరలో వాట్సాప్‌లో మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఫీచర్‌ని టెస్టింగ్ చేసిన నెలల తర్వాత అన్ని బీటా టెస్టర్‌ల కోసం వాట్సాప్ చివరకు ‘కంపానియన్ మోడ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గతంలోనే వాట్సాప్ కొద్దిమంది యూజర్లతో ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేసినట్టు గుర్తించింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు ఒకేసారి నాలుగు డివైజ్‌లకు కనెక్ట్ చేయడానికి, చాట్ హిస్టరీని అన్నింటిలో సింకరైజ్ చేసేందుకు అనుమతిస్తుంది.

వాట్సాప్ (WABetaInfo) నివేదిక ప్రకారం.. (Android v2.23.8.2) కోసం వాట్సాప్ బీటాతో ప్రోగ్రామ్‌లోని ప్రతి ఒక్కరికీ కంపానియన్ మోడ్ అందించనుంది. మీరు బీటా యూజర్ అయితే.. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే, డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అన్ని బీటా టెస్టర్‌లు ఫీచర్‌ని ఉపయోగించడానికి 24 గంటల వరకు సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ప్రస్తుత వాట్సాప్ అకౌంట్ మరొక మొబైల్ డివైజ్ లింక్ చేసేందుకు అనుమతిస్తుంది.

ఇప్పటికే ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను సెకండరీ మొబైల్ ఫోన్‌కి లింక్ చేసిన తర్వాత మొదటి ఫోన్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే యూజర్లు రెండో డివైజ్‌లో వారి చాట్‌లను వీక్షించవచ్చు. ప్రస్తుతం, iOS యూజర్లు తమ వాట్సాప్‌లో కంపానియన్ మోడ్ యాక్సెస్ చేయడం కుదరదు. కాబట్టి, రెండో డివైజ్ తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్ అయి ఉండాలని గమనించాలి.

మీరు ఇతర డివైజ్‌ల్లో కనెక్ట్ చేసినప్పుడు మీ WhatsApp అకౌంట్ కనెక్ట్ చేసిన అన్ని డివైజ్‌లలో మీ చాట్ హిస్టరీ సింకరైజ్ అవుతుంది. మీరు అదే సమయంలో మీ ఫోన్, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ ఉపయోగించినప్పుడు ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. కంపానియన్ మోడ్ ఫీచర్ అన్ని బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. స్టేటస్ అప్‌డేట్ పోస్ట్ చేయడం వంటి కొన్నింటికి ఇప్పటికీ అందుబాటులో లేదు.

కంపానియన్ మోడ్ ఏకకాలంలో నాలుగు డివైజ్ కనెక్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు లింక్ చేసిన ఫోన్ నుంచి వాట్సాప్ ఉపయోగించినప్పటికీ, మీ పర్సనల్ మెసేజ్‌లు, కాల్‌లు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎన్‌క్రిప్ట్ అవుతాయి. మీరు మెసేజ్ పొందినప్పుడు అది వెంటనే ఎన్ క్రిప్షన్ అవుతుంది. నివేదిక ప్రకారం.. మీ అన్ని డివైజ్‌లకు షేర్ అవుతుంది. కంపానియన్ మోడ్ ద్వారా మీరు నాలుగు డివైజ్‌ల్లో వాట్సాప్ ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం..

రెండో ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ కనెక్ట్ అయ్యేందుకు యూజర్లు (Google Play Store) నుంచి (WhatsApp Messenger) లేదా (WhatsApp Business) లేటెస్ట్ బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత, రిజిస్ట్రేషన్ స్క్రీన్‌పై ఓవర్‌ఫ్లో మెనుని Tap చేయాలి. ఆపై ‘Connect a device’ ఆప్షన్ కనిపిస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే ప్రైమరీ డివైజ్‌లో Settings > Connected devices ఎంచుకుని, బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌లో QR కోడ్‌ను స్కాన్ చేసేందుకు ఈ గాడ్జెట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com