రొబోటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ప్రారంభించిన GMR ఇన్నోవెక్స్
- April 13, 2023
హైదరాబాద్: అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు కట్టుబడిన GMR గ్రూప్ ఇటీవల GMR ఇన్నోవెక్స్ విస్తరణలో భాగంగా రోబోటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)ని ప్రారంభించింది. ముఖ్య అతిథి జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం (I&C) & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ;రమాదేవి లంక, డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, తెలంగాణ ప్రభుత్వం; SGK కిషోర్ -ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - సౌత్ ఎయిర్‌పోర్ట్స్ & చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, GMR గ్రూప్;హరి పణికర్-CEO-బిజినెస్ ఇంటిగ్రేషన్-ఎయిర్‌పోర్ట్స్(బిజినెస్ చైర్మన్ ఆఫీస్) GMR గ్రూప్;ప్రదీప్ పణికర్ CEO, GHIAL ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) రోబోటిక్స్ రంగంలో ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి, సహకారాలకు కేంద్రంగా ఉంటుంది.ఇది రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లను గుర్తించి, ఇంక్యుబేట్ చేసి, విమానాశ్రయ, విమానయాన రంగం కోసం వినూత్నమైన రోబోటిక్ ఉత్పత్తుల అభివృద్ధికి సహకరిస్తుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించి, అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది. రోబోటిక్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రోబోటిక్ ల్యాబ్, ఆలోచనా నాయకత్వాన్ని, పరిశ్రమ భాగస్వాములతో సహకారం అందించి, నైపుణ్యాన్ని పెంచడం మరియు స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడం చేస్తుంది.
రోబోటిక్స్‌కు మద్దతు ఇవ్వడంపై జయేష్ రంజన్, “అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిష్కారాలతో, ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా వివిధ పరిశ్రమలను ఆకర్షిస్తోంది. రోబోటిక్స్, ఆటోమేషన్ స్పేస్‌లో పనిచేస్తున్న స్టార్టప్‌లు, ఇండస్ట్రీ ప్లేయర్లకు వేదికను అందించడం ద్వారా రోబోటిక్స్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.ఈ దిశగా మరిన్ని పెట్టుబడులు, నిపుణులు, ఆవిష్కరణలను ఆకర్షించాలనుకుంటోంది.ఈ సాంకేతికతను వ్యాపారాన్ని సులభతరం చేయడం, మౌలిక సదుపాయాల మద్దతు, పరిశోధన తదితర అంశాలలో ఉపయోగించుకోవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో GMR ఇన్నోవెక్స్ ముందుంటూ, రాష్ట్రంలో కీలకమైన టెక్ హబ్‌గా ఉంటుంది.’’ అన్నారు.
SGK కిషోర్ మాట్లాడుతూ, “విమానాశ్రయం, ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మా రోబోటిక్స్ COE అత్యాధునిక సాంకేతికత, సామర్థ్యాలను పెంచే పరిష్కారాలను అందిస్తుంది. మేము ఈ కొత్త సాంకేతికతను గ్రూపు అంతటా ఉపయోగించాలనుకుంటున్నాము. ఇది వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడమే కాకుండా మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది. విమానయాన పరిశ్రమలో పరివర్తనాత్మక మార్పును తీసుకురావడానికి, మంచి భవిష్యత్తును రూపొందించడానికి సహాయపడే పారిశ్రామిక భాగస్వాములతో జట్టు కట్టినందుకు మేం సంతోషిస్తున్నాము.’’ అన్నారు.
GMR ఇన్నోవెక్స్ పెప్పర్మింట్, SINE IIT బాంబే, ఫ్లో మొబిలిటీతో అవకాశాలను అన్వేషించడానికి, విమానాశ్రయాలు, ఇతర అనుబంధ వ్యాపారాల కోసం రోబోటిక్ టెక్నాలజీ సంబంధిత యూజ్ కేసులను గుర్తించడానికి MOUపై సంతకం చేసింది.

తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







