యూఏఈ,బహ్రెయిన్ అత్యుత్తమ ప్రవాస దేశాల జాబితాలో అగ్రస్థానం
- April 15, 2023
ఇంటర్‌నేషన్స్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రవాసులకు అన్ని విధాల సౌకర్యవంతమైన దేశాల జాబితాలో గల్ఫ్లోని యూఏఈ,బహ్రెయిన్ దేశాలు బెస్ట్ అనిపించుకున్నాయి.టాప్-10 దేశాల లిస్ట్‌లో ఏకంగా నాలుగు దేశాలు చోటు దక్కించుకోవడం విశేషం.వాటిలో బహ్రెయిన్ మొదటి ర్యాంకులో నిలిస్తే.. యూఏఈ రెండో ర్యాంకు సాధించింది.ఇక ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ వరుసగా ఐదు, ఏడు, ఎనిమిది స్థానాలు దక్కించుకున్నాయి.ప్రవాసులకు సులువుగా రెసిడెన్సీ, పని దొరకడం అనే విషయాలను పరిగణలోకి తీసుకుని 52 గమ్యస్థానాలను ఇంటర్‌నేషన్స్ ఎంపిక చేసింది.
అలాగే ఎక్స్‌ప్యాట్ ఇన్‌సైడర్ 2022 సర్వే డేటాను కూడా దీనికోసం వినియోగించడం జరిగింది. ఇక బహ్రెయిన్ ఫస్ట్ ర్యాంక్‌లో నిలవడానికి ప్రవాసులు చెప్పిన ప్రధాన కారణం..ప్రభుత్వ అధికారులు వలసదారులకు సర్వీసులను చాలా సులువుగా అందజేయడమే.ఇక 70 శాతం మంది ఇక్కడ వీసా ప్రాసెస్ కూడా చాలా ఈజీ అని చెప్పడం జరిగింది.అలాగే వరల్డ్ వైడ్ ఇతర దేశాలతో పోలిస్తే బహ్రెయిన్‌లో రెసిడెన్సీ చాలా సులువు అని 56 శాతం మంది తెలిపారు. అంతేగాక లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడకుండా కూడా ఇక్కడ పని చేసుకునే వెసులుబాటు ఉంటుందట.ఇలా అన్ని విధాల ప్రవాసులకు బెస్ట్ దేశం బహ్రెయినే అని ఇంటర్‌నేషన్స్ తేల్చింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







