భారత్ లో 50వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య ..
- April 15, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో కొవిడ్ -19 వ్యాప్తి పెరుగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 10,753 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలు దాటి 53,720కి చేరింది. గడిచిన 222 రోజుల తరువాత యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలుపైగా రావడం ఇదే తొలిసారి.
తాజాగా నమోదైన కొవిడ్ -19 కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 27 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ మృతుల సంఖ్య 5.31లక్షలకుచేరింది. తాజా గణాంకాల ప్రకారం.. రోజువారీ పాజిటివిటీ రేటు 6.78శాతంకు చేరగా.. వారపు పాజిటివిటీ రేటు 4.49శాతంగా ఉంది.
దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యుపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. వచ్చే నెలలో కొవిడ్ -19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు.
మే నెల చివరి నాటికి 50 నుంచి 60వేల వరకు కొవిడ్ -19 కేసుల సంఖ్య చేరుకొనే అవకాశం ఉందని అగర్వాల్ తఅంచనా వేశారు. ఇందుకు రెండు కారణాలను పేర్కొన్నారు. మొదటిది వైరస్ తో పోరాడే సహజ రోగ నిరోధక శక్తి ఇప్పుడు 5శాతం మందిలో తగ్గింది. రెండో కారణం.. కోవిడ్ యొక్క కొత్త వేరియంట్. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







