అరబ్ ఆర్కిటెక్ట్స్ అడ్వైజర్‌గా మెకోస్
- May 08, 2016
అరబ్ ఆర్కిటెక్ట్స్ కన్సల్టింగ్ ఇంజనీర్స్ కంపెనీ, మోమ్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ సర్వీసెస్ కన్సలెంట్టగా మిడిల్ ఈస్ట్ కంప్యూటర్ సర్వీసెస్ (మెకోస్)ని ఏర్పాటు చేసుకుంది. మెకోస్ సంస్థ తనకున్న అనుభవాన్ని బహ్రెయిన్‌లో అరబ్ ఆర్కిటెక్ట్స్ చేపడ్తున్న ప్రాజెక్టులకు వినియోగించేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అరబ్ ఆర్కిటెక్ట్స్ ఆపరేషన్స్ మేనేజర్ మొహమ్మద్ అరైకాత్ మాట్లాడుతూ, మెకోస్ సర్వీసెస్ మరియు ప్రాడక్ట్స్ తమ కంపెనీకి ఎంతో ఉపయోగపడ్తాయని, తమ సంస్థ మరింతగా పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ఈ ఒప్పందం ఎంతో కీలకమని అన్నారు. 2005లో ఏర్పాటయిన అరబ్ ఆర్కిటెక్ట్స్ 250 మిలియన్ బహ్రెయిన్ దినార్స్ విలువైన ప్రాజెక్టుల్ని చేపట్టింది. అల్ సఫర్ గ్రూప్ అదెల్ అల్ సఫర్ మాట్లాడుతూ, అరబ్ ఆర్కిటెక్ట్స్ త్రీడీ ప్లాన్స్‌తో తమ ప్రాజెక్టులను ఇంకా అదఱ్భుతంగా రూపొందించగలుగుతుందని అభిప్రాయపడ్డారు. అరబ్ ఆర్కిటెక్ట్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ, వారికి తమ సంపూర్ణ సహకారాలు అందిస్తామని మెకోస్ సీఈఓ అహ్మద్ ఖాల్ఫాన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









