జపాన్ ప్రధాని పై స్మోక్ బాంబు దాడి

- April 15, 2023 , by Maagulf
జపాన్ ప్రధాని పై స్మోక్ బాంబు దాడి

టోక్యో: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాపై స్మోక్ బాంబు దాడి జరిగింది. ఒకాయమా నగరంలో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై దాడి చేశారు. ప్రధాని ఫుమియో కిషిదా ప్రమాదం నుంచి తప్పించున్నారు.స్మోక్ బాంబు పేలడంతో అక్కడున్న ప్రజలంతా భయంతో పరుగుల తీశారు. భద్రతా సిబ్బంది వెంటనే కిషిదాను కవర్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ప్రధాని కిషిదాను భద్రతా దళాలు సురక్షితంగా తరలించాయి.కిషిదా ప్రసంగం ప్రారంభించిన కొన్ని సెకన్లకేు భారీ పేలుడు సంబంధించింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్మోక్ బాంబును విసిరిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గుంపులో ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు.

ఒకాయమాలో ఫిషింగ్ హార్బర్ ను కిషిదా సందర్శించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో కిషిదా ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వచ్చే నెలలో ఆయన హిరోషిమాలో జీ-7 సదస్సుకు ఆతిథ్యమివ్వనున్నారు. గతేడాది జపాన్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని షింబో అబేపై కూడా ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు.

ఇంట్లో తయారు చేసిన తుపాకీతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఛాతిలో బుల్లెట్ దిగడంతో ప్రాణాలు కోల్పోయాడు.ఎన్నికల్లో ఆయన పార్టీనే ఘన విజయం సాధించింది.ఇప్పుడు కొత్త ప్రధాని ఫుమియో కిషిదాపైనా అదే తరహాలో దాడి జరగడం అధికారులను ఆందోళన కలిగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com