తల్లి గర్భం

- April 15, 2023 , by Maagulf
తల్లి గర్భం

అమృతాలయం తల్లి గర్భం, 
సత్సాంగత్యంతో తింటే సాత్వికాహరం.
ఎందరో మహానుభావుల జననం,
తల్లి తండ్రి సాత్వికాలోచనల పుణ్యం.

ప్రతి జీవి తను చేసుకున్న కర్మల మర్మం,
రాబోయే జన్మ జన్మల దేహం.
తల్లి ఆలోచనామృతమే పిల్లల భాగ్యం, 
ఈశ్వరిక్షానుసారమే జీవి జీవితం. 

మన సంస్కృతి సంస్కారం,
నేర్పుతుంది తల్లికి సాంప్రదాయం. 
అనుసరిస్తే అద్భుతమైన ఫలితం,
ఆదమరిస్తే దుష్ప్రభావం. 

మన శాస్త్రీయపద్ధతి తెలుపుతుంది సత్యం, 
కళ్ళముందే మహాత్ముల జీవిత కథాసారం.
అత్యంత శక్తిమంతమైనది తల్లి గర్భం, 
అంతర్లీనంగా ఆలోచిస్తే అమూల్యం.

అప్పటి ఆలోచనల ప్రబావమే పిల్లల జీవనం
తల్లి దండ్రిని నేర్చుకోనుంటే సంస్కారం.  
పెద్దలను వారిస్తూ వదలంటారు జాడ్యం,
అందుకే అనుభవిస్తున్నాము కుసంస్కారం.

అశ్లీలమైన భావాన్ని నింపుతున్నాము,
అర్థరహితంగ అసంతృప్తే చూపుతున్నాము.
బుద్ధి హీనంగా జీవితాన్ని దిద్దుతున్నాము,
సత్యం ధర్మం నేర్పక మండుతున్నాము.
 
అమృత తత్త్వమే ఐశ్వర్యమనే అర్థం 
అహంకారమయమై కూర్చుంది మదం
డాబిక మాటలే గౌరవమనే అబద్ధం
ప్రస్తుత పరిస్థితుల్లో జీవన విధానం

ఇదే సరైనదనంటే ఎవరిని ఏమనలేము
ఏది సరైనదో తెలుసుకుంటే క్షేమము
రాబోవు తరాలకు పంచివ్వాలి సంస్కారం 
ధర్మయుక్తంగ ఆలోచించండి ఆత్మే సర్వం.

నాడు!
ఉదా-భక్త ప్రహ్లాద,అభిమన్యుడు 
నేడు!
ఎందరో ఎందరెందరో మరెందరో

మన "బ్రహ్మంగారి జీవిత చరిత్రలో భాగం"
చదవండి చదివించండి చది చెప్పండి 

ప్రతి తల్లికి తండ్రికి హృదయ పూర్వకంగా
మనస్సాక్షిగా ఇస్తున్నాను అంకితం. 
చదివిన వారందరికి నమస్కారములు.

--జి.రామమోహన నాయుడు (మాజీ సైనికుడు)
మదనపల్లె రచయితల సంఘం,ఆంధ్ర ప్రదేశ్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com