సుడాన్‌కు విమాన సర్వీసులు రద్దు
- April 16, 2023
యూఏఈ: సుడాన్ రాజధానిలో పెరుగుతున్న పౌర అశాంతి పరిస్థితుల కారణంగా యూఏఈకి చెందిన విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా ఏప్రిల్ 15 నుండి 17 వరకు సుడాన్‌కు తమ విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించాయి. దుబాయ్ ఆధారిత విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ ఏప్రిల్ 15 నుండి 17 వరకు సుడాన్‌కు తమ విమానాలను రద్దు చేశాయి. అదే విధంగాసుడాన్‌కు వెళ్లే అన్ని విమానాలు తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ అరేబియా తెలిపింది. ప్రయాణీకులు రీబుకింగ్ ఎంపికల కోసం వారి సంబంధిత ట్రావెల్ ఏజెంట్ లేదా విమాన యాన కాల్ సెంటర్లను సంప్రదించాలని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు. నివేదికల ప్రకారం, సుడాన్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)లు అధ్యక్ష భవనం, ఆర్మీ చీఫ్ నివాసం, KRT లను శనివారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







