16 మందిని బలిగొన్న దుబాయ్ అగ్నిప్రమాదం

- April 16, 2023 , by Maagulf
16 మందిని బలిగొన్న దుబాయ్ అగ్నిప్రమాదం

దుబాయ్: దుబాయ్‌లోని అల్ రాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో16 మంది మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు.భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం నుండి బయటపడ్డ అద్దెదారులు రాత్రంతా భయంతో గడిపారు. నాల్గవ అంతస్తులో ఓ అపార్ట్మెంట్లోని ఎయిర్ కండీషనర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాప్తి చెందాయని స్థానికులు తెలిపారు. కొద్దిసేపట్లోనే ఏసీ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని పేర్కొన్నారు.
నివాసితుల కష్టాలు
రమదాన్ మాసంలో భవనంలోని నివాసితులు ఫజ్ర్ ప్రార్థనల తర్వాత నిద్రపోవడం.. తెల్లవారుజామున 1 గంటల తర్వాత వారి దినచర్యను ప్రారంభించడం అలవాటు చేసుకున్నారు. అయితే, విషాదం జరిగిన రోజు పెద్ద పేలుడు చప్పుడు వారిని నిద్రలేపింది. “మొబైల్‌లో ఉన్న నా రూమ్‌మేట్, పొగ వాసనను గ్రహించి మమ్మల్ని లేపాడు. మరో నిమిషంలో పేలుడు చప్పుడు వినిపించింది. మా గదిలోకి పొగ రావడం ప్రారంభించింది. వెంటనే మేము బాల్కనీకి వెళ్లి సహాయం కోసం పిలవడం ప్రారంభించాము. అప్పటికే వీధుల్లో వందలాది మంది గుముకుడటం గమనించాము." అని ప్రమాదం నుంచి బయటపడ్డ ఓ అద్దెదారుడు వివరించాడు. 
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్‌కు తెల్లవారుజామున 12.35 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందింది. ఒక బృందం ఆరు నిమిషాల్లో స్థలానికి చేరుకుని, సహాయక, అగ్నిమాపక కార్యకలాపాలను ప్రారంభించింది. పోర్ట్ సయీద్, హమ్రియా అగ్నిమాపక కేంద్రాల బృందాలు కార్యకలాపాలకు బ్యాకప్ అందించాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక అందజేసేందుకు సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com