హైదరాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ ట్రైన్లు
- April 16, 2023
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ట్రైన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటీకే తెలుగు రాష్ట్రాలు రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతుండగా..మరో రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పూణె మధ్య వందే భారత్ ట్రైన్లను తీసుకరాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే వీటిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో మూడు, నాల్గు నెలల్లో ఈ రెండు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ రెండింటిలో ఒక ట్రైన్ కాచిగూడ-బెంగళూరు మధ్య ప్రయాణించనుండగా.. మరో ట్రైన్ సికింద్రాబాద్-పూణె మధ్య సర్వీసులు అందించనుంది. దక్షిణ మధ్య రైల్వేతో కలిసి భారతీయ రైల్వే ఈ రెండు సర్వీసులకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-బెంగళూరు రూట్ల మధ్య అనేక ట్రైన్లు ప్రయాణం సాగిస్తున్నాయి. వీటిల్లో 12 గంటల ప్రయాణ సమయం పడుతుంది. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ రెండు సిటీల మధ్య అందుబాటులోకి వస్తే కేవలం 8 గంటల్లోనే చేరుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తంది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







