యజమాని కారుకు నిప్పు.. ఇద్దరికి జైలుశిక్ష, Dh66,000 జరిమానా
- April 16, 2023
దుబాయ్: మాజీ యజమాని కారుకు నిప్పుపెట్టిన ఇద్దరికి జైలుశిక్ష, Dh66,000 జరిమానాను కోర్టు విధించింది. ఈ ఘటనలో పార్కింగ్ స్థలంలో ఉన్న అనేక వాహనాలు కూడా దగ్ధం అయ్యాయి.కేసు ఫైల్ ప్రకారం, దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్క్ ప్రాంతంలోని ఇసుక యార్డ్‌లో బహుళ వాహనాలు అగ్నికి ఆహుతైనట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్‌కు కాల్ వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు.ఒక వాహనానికి ఉద్దేశ్యపూర్వకంగా నిప్పుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు అనుమానితులను వారు గుర్తించారు.విచారణలో, అనుమానితుల్లో ఒకరు కారుకు నిప్పు పెట్టినట్లు అంగీకరించాడు. ఆ కారు గతంలో తన యజమానికి చెందినదని, అతను మద్యం అమ్మకాలు, పంపిణీ చేసేవాడని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో, యజమాని నిందితుడిపై దాడి చేసి పని నుంచి తొలగించాడు. దీనికి ప్రతీకారంగా మాజీ యజమాని కారుకు నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.బాధితుడు తన కారును ఇసుక యార్డ్‌లో పార్క్ చేయడం చూసిన ఇద్దరు అనుమానితులు.. కారుకు నిప్పు పెట్టారు. నేరం చేసిన తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కేసు విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్టు ఇద్దరిని దోషులుగా నిర్ధారించి ఏడాది జైలు శిక్ష విధించింది. వారికి 66,000 దిర్హామ్‌ల జరిమానాతో పాటు శిక్షను అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







