సౌదీ వ్యోమగాములతో సమావేశమైన క్రౌన్ ప్రిన్స్
- April 17, 2023
జెడ్డా: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే ముందు సౌదీ వ్యోమగాములు రయ్యానా బర్నావి, అలీ అల్-కర్ని, మరియం ఫర్దౌస్, అలీ అల్-గమ్దీలు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మరియు సుప్రీం స్పేస్ కౌన్సిల్ ఛైర్మన్ మహ్మద్ బిన్ సల్మాన్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతూ.. వ్యోమగాములు ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరత రంగాలలో నిర్వహించే తమ పరిశోధనల ద్వారా ప్రజలకు మేలుకు పాటుపడాలన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను నేరవేర్చి.. స్వదేశానికి క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. క్వాలిఫికేషన్ ప్రోగ్రామ్‌లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించినందుకు వ్యోమగాములను క్రౌన్ ప్రిన్స్ అభినందించారు. ఇదిలా ఉండగా.. బర్నావి, అల్-ఖర్నీ మే 9న ఫ్లోరిడా నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లనున్నారు. అదే సమయంలో వారికి మద్దతుగా ఫర్దౌస్, అల్-ఘమ్‌డిని ఎర్త్ స్టేషన్ విధుల్లో ఉంటారు. రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు అయిన బర్నావి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి సౌదీ మహిళగా అవతరించనున్నారు.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







