స్నేహితులు, బంధువులను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేస్తే.. ఇకపై నో ఫైన్
- April 17, 2023
మస్కట్: స్నేహితులను విమానాశ్రయానికి తీసుకెళ్లే లేదా వారి ప్రైవేట్ వాహనాల్లో సరుకులను డెలివరీ చేస్తున్న ప్రవాసులపై జరిమానాలు విధించినట్లు వచ్చిన ఆరోపణలపై రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MoTCIT) స్పందించింది. “ఇటీవల భూ రవాణాపై తనిఖీ ప్రచారాలు విస్తృతం చేశాము. నిబంధనల అమలులో భూ రవాణా వినియోగదారుల భద్రత, వస్తువుల భద్రత, భూ రవాణా పార్టీల హక్కులను సంరక్షించడం తమ బాధ్యత. భూ రవాణా చట్టంలోని కార్యనిర్వాహక నిబంధనల నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లకు మాత్రమే జరిమానా విధించాలని తనిఖీ బృందాలను ఆదేశించాం. ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం లేకుండా తమ పరిచయస్తులు, స్నేహితులను రవాణా చేసే డ్రైవర్లకు ఎలాంటి ఫైన్ వేయొద్దని ఆదేశించాం.’’ అని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజలు తమ స్నేహితులు లేదా బంధువులను రవాణా చేస్తున్నప్పుడు జరిమానా విధిస్తే.. వారి ఫిర్యాదులను అది జారీ చేసిన తేదీ నుండి 15 రోజులలోపు మంత్రిత్వ శాఖ జనరల్ ఆఫీస్‌లోని భూ రవాణా శాఖ లేదా గవర్నరేట్‌లోని రోడ్స్ డిపార్ట్మెంట్లో సమీక్ష కోసం సమర్పించవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







