అమర్నాథ్ యాత్రకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు
- April 17, 2023
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో 62 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈ ఏడాది జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. అమర్నాథ్కు ఉన్న రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం కానుంది. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం మార్గం, గందేర్బల్ జిల్లా బల్తాల్ మార్గాల్లో ఒకదాన్ని యాత్రికులు ఎంచుకోవచ్చు. ఈ విషయాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.
13 నుంచి 37 ఏళ్ల లోపు వయసున్న వాళ్లు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనాలి. యాత్రికులకు ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. 6 వారాలు లేదా అంతకంటే ఎక్కువ గర్భం ఉన్న స్త్రీలను ఈ యాత్రకు అనుమతించరు. అమర్నాథ్ యాత్రను సందర్శించడానికి దేశ నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







