ఉత్సాహంగా ప్రారంభమైన పిచ్వాయి, తంజోర్, గోండు చిత్ర లేఖన సదస్సు
- April 17, 2023
విజయవాడ: పిచ్వాయి, తంజోర్, గోండు చిత్ర లేఖన అభిమానులకు వినూత్న అవకాశాన్ని కల్పిస్తూ క్రియేటివ్ సోల్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని మాలక్ష్మి గ్రూపు సిఇఓ సందీప్ మండవ అన్నారు. ఇతర రాష్ట్రాల కళలను తెలుగు ప్రజలకు పరిచయం చేసేలా నగరంలోని కల్చరల్ సెంటర్ ఆప్ విజయవాడ, అమరావతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్క్ షాపును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ విజయవాడ ప్రజలు ఎప్పుడు కళలకు మంచి ప్రోత్సాహకులుగా ఉన్నారని, ప్రత్యేకించి యువత ఉత్సాహంగా ముందుకు రావటం అభినందనీయమన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ కళలకు తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. క్రియెటివ్ సోల్ వ్యవస్దాపకులు సుమన్ మీనా, నేహా జైన్ మాట్లాడుతూ పిచ్వాయి, తంజోర్, గోండు చిత్రలేఖనంలో ఆరితేరిన శిక్షకుల ద్వారా వర్క్ షాపును నిర్వహిస్తున్నామన్నారు. నగర ప్రజల సందర్శనార్ధం ప్రత్యేక ప్రదర్శనను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఉధయం 10 నుండి 12గంటల వరకు గోండు, మద్యాహ్నం మూడు నుండి ఐదు వరకు తంజోర్, సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు పిచ్వాయి చిత్రలేఖనంపై అభ్యాసం ఉంటుందన్నారు. శిక్షణకు అవసరం అయిన పూర్తి సామాగ్రిని క్రియేటివ్ సోల్ సమకూర్చుతుందని, ఇందుకోసం నామమాత్రపు రుసుము చెల్లించవలసి ఉంటుందని, 23వ తేదీ వరకు వర్క్ షాపు జరుగుతుందని వివరించారు. ఆసక్తిగలవారు 7893911717, 8008268885 నెంబర్లలో సంప్రదించవచ్చని, వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా అభ్యసించవచ్చని సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు.


తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







