దుబాయ్ అగ్నిప్రమాదం: భారతీయుల కుటుంబాలకు రూ.1 మిలియన్ పరిహారం
- April 18, 2023
యూఏఈ: దుబాయ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరు భారతీయుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.1 మిలియన్ (45,000 దిర్హామ్‌లు) ప్రకటించింది. శనివారం దుబాయ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు మరణించారనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని, యూఏఈలోని భారత రాయబార కార్యాలయం మృతదేహాలను తమిళనాడుకు తరలిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. శనివారం అల్ రాస్‌లోని నివాస భవనంలో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఇమామ్ కాసిమ్ (43), ఎస్ మహ్మద్ రఫీక్ (49) సహా 16 మంది మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపిన దుబాయ్‌లోని భారత కాన్సులేట్.. మృతదేహాలను స్వదేశానికి తరలించింది. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు భారతీయులు చనిపోయారు. దుబాయ్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే కేరళలోని మలప్పురానికి చెందిన జేషి కందమంగళత్, ఆమె భర్త రిజేష్ కలంగదన్‌లు కూడా ఇదే ప్రమాదంలో మరణించారు. ఇప్పటికే వీరి మృతదేహాలను కేరళకు తరలించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







