ఆరోగ్య మంత్రి తో భారత రాయబారి భేటీ
- April 18, 2023
మనామా: బహ్రెయిన్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్.. భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవను కలుసుకుని ఇరు దేశాల మధ్య ఉమ్మడి సహకారం పై చర్చించారు.ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ లుల్వా రషీద్ షోయిటార్ కూడా పాల్గొన్నారు.బహ్రెయిన్ రాజ్యం, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు.. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో క్రమంగా పెరుగుతున్న సహకారాన్ని మంత్రి జవాద్ హసన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇరుపక్షాలు ఉమ్మడి సహకారంతో పాటు నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, శిక్షణను ప్రోత్సహించడానికి సమన్వయం గురించి చర్చించారు. ఆరోగ్య అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ఆరోగ్యం, వైద్య విజ్ఞాన రంగాలలో మరింత సహకారానికి ఉమ్మడి ప్రయత్నాలను పేర్కొంటూ, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని భారత రాయబారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!







