దుబాయ్ లో 'తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్-TFCC' బ్రాంచి ప్రారంభం
- April 18, 2023
దుబాయ్: తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు చెందిన వివిధ రంగాలలోని వారి ప్రతిభను గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పురస్కారం 'నంది అవార్డు'. తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు ఈ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత ఈ వేడుకలను సినీ అభిమానులు ఎంతగానో మిస్ అయ్యారు అనటంలో అతిశయోక్తి లేదు.
షుమారు 7 సంవత్సరాల తరువాత ఈ నంది అవార్డుల ప్రధానోత్సవాన్ని తిరిగి ఘనంగా ప్రారంభించేందుకు నడుం బిగించింది 'తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్'. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభత్వాలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించడం గమనార్హం.
ఇన్ని సంవత్సరాల తరువాత జరుగనున్న ఈ వేడుకలపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో కొసమెరుపు ఏంటంటే..ఈ వేడుకలను విదేశీ గడ్డ అయిన దుబాయ్ వేదిక కానున్నది. నంది అవార్డుల కార్యక్రమానికి తగిన ఏర్పాట్లను స్వయంగా చూసేందుకు 'తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్' చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ యూఏఈ విచ్చెయ్యటమే కాకుండా యూఏఈ అధికారులతో మరియు ఇండియన్ కాన్సులేట్ అధికారులతో సమావేశమై అవార్డుల కార్యక్రమంపై సుదీర్ఘ చర్చలు జరపటం జరిగింది.
'తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్' TFCC బ్రాంచీని దుబాయ్ డౌన్ టౌన్ లో బుర్జ్ ఖలీఫా కు చేరువలో యూఏఈ లో నివసిస్తున్న పలు ప్రముఖుల సమక్షంలో అధికారికంగా నేడు రామకృష్ణ గౌడ్ ప్రారంభించడం జరిగింది. ఈ బ్రాంచి ను దుబాయ్ లో నివసిస్తున్న ఛార్టర్డ్ అకౌంటెంట్ రవి కుమార్ సింగిరి, నటుడు ప్రకాష్ నాగ్ పర్యవేక్షించనున్నారు.
అటు పై జరిగిన విలేఖరుల సమావేశంలో రామకృష్ణ గౌడ్, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ 2016 రష్మిక ఠాకూర్, బొక్కా సత్యనారాయణ, రవి కుమార్ సింగిరి, నటుడు ప్రకాష్ నాగ్ పాల్గొన్నారు.
_1681836697.jpg)
రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "తన 40 ఏళ్ళ సినీ అనుభవాన్ని మేళవించి అత్యంత ఘనంగా ఈ వేడుకలకు నిర్వహించాలని అనుకుంటున్నాం. యూఏఈ లో నివసిస్తున్న ఎందరో సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని ఆశపడేవారికి ఒక వేదిక కల్పించాలి అనే సత్సంకల్పంతో దుబాయ్ బ్రాంచిని ప్రారంభించటం జరిగింది. ఔత్సాహిక నటీనటులకు, టెక్నికల్ రంగం పై మక్కువ ఉన్నవారికి అవకాశాలు కల్పించేందుకు మేము అన్నివేళలా అందుబాటులో ఉండగలం. ఈ సంకల్పానికి యూఏఈ లో నివసిస్తున్న తెలుగు వారు సహాయసహకారాలు అందించి మమ్మల్ని ప్రోత్సహించారు.మెల్లిగా 'ఫిలింనగర్' ను తలపించేట్టుగా దుబాయ్ లో కార్యక్రమాలు జరిగేట్టు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
ఈ ఆలోచనకు తొలి అడుగుగా 'నంది అవార్డులు' ప్రపంచం గర్వించేట్టుగా చేసేందుకు కృషి చేస్తున్నాం. 'నాటు నాటు' పాటతో ప్రపంచ వేదికపై గర్వంగా తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచేట్టు చేసిన 'ఆర్ ఆర్ ఆర్' టీం తో పాటు పలువురు ఆస్కార్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. అంతే కాకుండా దుబాయ్ రాజకుటుంబీకులు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తరపున పలువురు మంత్రులు, సినీ ప్రముఖులు అతిథులుగా విచ్చేయనున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమల నుండి కూడా ప్రముఖులను ఆహ్వానించనున్నాము. సన్నీ లియోన్, ముమైత్ ఖాన్ చే ప్రత్యేక పెర్ఫార్మన్స్ లను ప్లాన్ చేస్తున్నాం. మొత్తంగా యావత్ భారత సినీ పరిశ్రమ అభిమానులను అలరించే విధంగా ఈ నంది అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది" అని రామకృష్ణ గౌడ్ అన్నారు.
_1681836778.jpg)
రష్మిక ఠాకూర్ మాట్లాడుతూ...మా ఆలోచనకు దుబాయ్ లోని తెలుగు వారు ఎంతో సహకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న నంది అవార్డుల వేడుక ఇలా ఎన్నారై లతో చేసుకోవటం ఒక సరికొత్త అనుభవం అని అన్నారు.
_1681836811.jpg)
యూ-టర్న్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన దుబాయ్ వాస్తవ్యులు బొక్కా సత్యనారాయణ మాట్లాడుతూ..టాలీవుడ్ త్వరలో దుబాయ్ తరలివస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్ లో నంది అవార్డుల వేడుక అనే ఆలోచనను స్వాగతిస్తున్నాము. యువతకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు అందుతాయి. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొవటం సంతోషంగా ఉంది అని అన్నారు.
_1681836869.jpg)
TFCC దుబాయ్ విభాగం కమిటీ సభ్యులు రవి కుమార్ సింగిరి మాట్లాడుతూ..ఈ వేడుకలో నేను భాగం అవ్వటం నా దృష్టంగా భావిస్తున్నాను. మా వంతు సహకారం అందిస్తామని, వేడుకను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని, తెలుగు వారి గౌరవాన్ని నిలబెడతామని అన్నారు.
_1681836912.jpg)
TFCC దుబాయ్ విభాగం కమిటీ సభ్యులు, నటుడు ప్రకాష్ నాగ్ మాట్లాడుతూ...యువతకు ఇది స్వర్ణావకాశం. దుబాయ్ లో బ్రాంచి ఏర్పాటు అనేది ఒక సంచలనాత్మక నిర్ణయం. దీనికి యూఏఈ ప్రభుత్వం సహకరించడం ఎంతో ఆనందాన్నిస్తోంది అని అన్నారు.


తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







