దోహా: ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులకు ICBF ఇఫ్తార్

- April 19, 2023 , by Maagulf
దోహా: ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులకు ICBF ఇఫ్తార్

దోహా: ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF), డెసర్ట్ లైన్ గ్రూప్‌లు  ఇండస్ట్రియల్ ఏరియా స్ట్రీట్ 38లో ఉన్న లేబర్ క్యాంప్‌లో ఇఫ్తార్ నిర్వహించింది. ఇందులో దాదాపు 2000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబార కార్యాలయ ప్రథమ కార్యదర్శి, ICBF సమన్వయ అధికారి  సుమన్ సోంకర్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ICBF ప్రెసిడెంట్ షానవాస్ బావ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో  డిజర్ట్ లైన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ICBF అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు అరుణ్‌కుమార్, ఐసిబిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి, జనరల్ సెక్రటరీ వర్కీ బోబన్, ఐసిబిఎఫ్ గత ప్రెసిడెంట్  వినోద్ వి నాయర్, ఐసిబిఎఫ్ సెక్రటరీ ముహమ్మద్ కున్హి, మేనేజింగ్ కమిటీ సభ్యులు అబ్దుల్ రవూఫ్, శంకర్ గౌడ్, కుల్దీప్ కౌర్, జరీనా అహద్, ఐసిసి మేనేజింగ్ కమిటీ సభ్యుడు అబ్రహం జోసెఫ్ పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com