అందరికీ స్పూర్తినిచ్చే .. ''నాట్యం''
- May 09, 2016
ప్రతి మనిషి జీవితంలో ఏవేవో లక్ష్యాలు ఉంటాయి .. కొందరు అవి సాధించేందుకు శ్రమిస్తే .. మరికొందరు .. ఆ కోరికలను చంపుకుని బ్రతుకుతుంటారు? జీవితం అంటే మనకు నచ్చినట్టు జీవించడం, మన ఉనికిని ప్రపంచానికి తెలియచేయాలనే మంచి కథతో తెరకెక్కిన లఘు చిత్రం .. 'నాట్యం'. సంధ్య రాజు, అలేక్య పుంజాల, వాసుదేవ రావు, సంజయ్ నటించిన ఈ చిత్రాన్ని రేవంత్ కోరుకొండ తెరకెక్కించాడు. కీర్తిలాల్ డైమండ్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ప్రివ్యూ షో , ప్రెస్ మీట్ సోమవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం కీర్తిలాల్ డైమండ్స్ ప్రతినిధి మధుసూదన్ మాట్లాడుతూ .. కీర్తి లాల్ డైమండ్స్ చాలా కాలంగా ఆంద్రప్రదేశ లో గోల్డ్ , డైమాండ్ షో రూం లను స్తాపించింది. ఈ కంపనీ కి సొంతంగా డైమండ్ తయారు చేసే ప్లాంట్ కోయంబత్తూరు లో ఉంది, అందులో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తారు. ఇక ఈ నాట్యం సినిమాకు సపోర్ట్ ఇవ్వడానికి కారణం .. మహిళలు తన జీవితంలో ఏదో సాదించాలనే లక్ష్యాన్ని .. కొన్ని పరిస్తితుల వల్ల దాన్ని వదిలేసి .. జీవితంలో అసలైన ఆనందాన్ని కోల్పోతున్నారు .. అలాంటి వారికి ఈ సినిమా ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మంచి కథ. లక్ష్యం చేరుకోవాలంటె అడ్డంకులను అదిగమించాలని బాగా చెప్పారు. ఇంత మంచి చిత్రాన్ని తీసిన రేవంత్ ని అభినందిస్తున్నాను. ఈ సినిమాలో నటించిన సంధ్య అనుభవం ఉన్న నటిలా చక్కగా నటించింది అన్నారు.
దర్శకుడు రేవంత్ మాట్లాడుతూ .. ఈ సినిమా తీయడానికి కారణం .. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం. ఇది నాకు విజిటింగ్ కార్డు గా ఉపయోగపడుతుందని తీసా. ఈ కథ అనుకున్నప్పుడు నిజంగా నాట్యం తెలిసిన నటి కోసం చాలా వెతికా. హైదరాబాద్ లో చాలా డాన్స్ స్కూల్స్ తిరిగి, చివరగా సంధ్య గారిని చూసిన తరువాత ఈ పాత్రకు కరక్ట్ అని భావించి ఆమెతో మాట్లాడాను. కథ తనకు కూడా బాగా నచ్చడం తో ఈ సినిమా చేసారు, ఈ సినిమా కోసం పనిచేసిన నా టీం ఏంతో సపోర్ట్ అందించింది. ముఖ్యంగా డిఓపి శేఖర్, సిద్దార్థ్ ల సపోర్ట్ మరచిపోలేనిది, ప్రశాంత్ మంచి సాంగ్స్ ఇచ్చాడు . తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
అలేఖ్య మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. సంధ్యరాజు ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాబట్టి చక్కగా హావభావాలను పలికించింది. నాట్యం మన సంస్కృతికి సంబంధించింది. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి'' అని అన్నారు.
హీరోయిన్ సంధ్యరాజు మాట్లాడుతూ .. డాన్సర్ గా చాలా షో లు చేసాను కాని నటిగా ఇది నా తొలి చిత్రం. రేవంత్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాను. ఈ రోజుల్లో చాలా మంది తమ లక్ష్యాలను ఏవేవో కారణాలతో వదిలేసి .. త్రుప్తి లేని జీవితం గడుపుతున్నారు . ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి . వాటిని అధిగమించి మన గోల్ ని రీచ్ అవ్వడమే జీవితం. రేవంత్ చాలా గొప్పగా తీసాడు. తప్పకుండా మాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను.. అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







