యుక్రెయిన్ ప్రజలను వణికించిన ప్లాష్ లైట్..
- April 20, 2023
యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాదికాలంకుపైగా రష్యా సైన్యం దాడులతో యుక్రెయిన్ ప్రజలు భయంతో వణికిపోతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రాంతంలో రష్యా క్షిపణులు పడుతాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుక్రెన్ ప్రజలు జీవనం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో యుక్రెయిన్ రాజధాని కీవ్ గగనతలంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. వేగంగా అది భూమిపైకి వస్తున్నట్లు ఉండటంతో రష్యా వైమానిక దాడి అయి ఉండొచ్చని స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు.
కీవ్ గగనతలంపై బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఈ వెలుగుతో అప్రమత్తమైన అధికారులు వైమానిక దాడులు జరుగుతోందేమోనని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, కొద్దిసేపటి తరువాత అది వైమానిక దాడివల్ల వచ్చిన వెలుగు కాదని, నాసా ఉపగ్రహం వల్ల వచ్చిన వెలుగు అని తేలింది. నాసా వారం రోజుల క్రితం ఈ విషయాన్ని చెప్పింది. ఓ ఉపగ్రహం బుధవారం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని, ఇది వాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోతుందని పేర్కొంది. ఆ సమయంలో వెలుగు వస్తుందని, కానీ భూమిపై ఎవరికి ప్రమాదం ఉండదని తెలిపింది.
కీవ్ గగనతలంపై ప్రకాశవంతమైన వెలుగును కొందరు వీడియోల్లో బంధించారు. స్థానిక ప్రసార మాద్యమాల్లో ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడంతో మీమ్స్ హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. మీమ్స్ లో మైమానిక దళం గుర్తులను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







