తెల్లగా మెరిసిపోయే దంతాల కోసం.!
- April 20, 2023
ప్రస్తుతం పరిస్థితుల్లో దంత సమస్యలు అధికంగా బాధిస్తున్నాయ్. అందుకోసం లిస్టరీన్ తదితర మౌత్ వాష్‌లు, రకరకాల మౌత్ ప్రెషనర్లు మార్కెట్లో అందుబాటులో వున్నప్పటికీ అవన్నీ జస్ట్ టెంపరరీ రిలీఫ్‌గానే పని చేస్తున్నాయ్.
దంత సమస్యలు అనేక రకాలు. చిగుళ్ల నుంచి రక్తం కారడం, గట్టి వస్తువులు కొరకలేకపోవడం, ఐస్ క్రీమ్ వంటి చల్లని వస్తువులు తీసుకున్నప్పుడు పళ్లు జివ్వుమనిపించడం గట్రా రకరకాల సమస్యలకు చిన్న చిన్న వంటింటి చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.!
ఒక బౌల్‌లో కొద్దిగా బేకింగ్ సోడా, అంతే మోతాదులో చార్‌కోల్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది), కొద్దిగా కొబ్బరి నూనె కలిపి, ఈ మిశ్రమంతో ఓ ఐదు నిమిషాలు బ్రష్ చేస్తే దంత సమస్యలు దూరం కావడంతో పాటూ, గార పట్టి పసుపు పచ్చ రంగులోకి మారిపోయిన దంతాలు తెల్లగా మెరుస్తాయి. వారంలో రెండు నుంచి మూడు సార్లు ఇలా చేస్తే సరిపోతుంది.
అలాగే, పసుపు, దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం కలిపిన మిశ్రమంతో బ్రష్ చేసినా ఫలితం వుంటుంది.
పుదీనా ఆకులు నీటిలో మరిగించి అందులో రెండు చుక్కల నిమ్మరసం కలిసి పుక్కిలిస్తే, దంతాలకు సంబంధించిన చిగురు వాపులు, రక్తస్రావం కావడం తదితర సమస్యలు దూరం కావడంతో పాటూ, పసుపు పచ్చని గార పట్టిన పళ్లు తెల్లగా మెరుస్తాయ్. నోటి దుర్వాసన వుండదు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







