సినిమా రివ్యూ: విరూపాక్ష.!
- April 21, 2023
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల, అజయ్, రవికృష్ణ తదితరులు
దర్శకుడు: కార్తీక్ దండు
నిర్మాత: బి.వి.యస్.ఎన్.ప్రసాద్
మ్యూజిక్: అజనీష్ లోక్ నాధ్
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత చేసిన సినిమా ‘విరూపాక్ష’. రిలీజ్‌కి ముందే ఈ సినిమాపై బాగా బజ్ క్రియేట్ అయ్యింది. అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలని, తేజుకి మంచి సక్సెస్‌నివ్వాలనీ ఆశించారు. ఆ అంచనాల్ని ‘విరూపాక్ష’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
రుద్రవనం అనే ఊరు. క్షుద్ర పూజలు చేస్తున్నారని భావించి ఓ భార్య భర్తను తగులబెట్టి చంపేస్తారు ఆ ఊరి జనం. ఆ ఊరికి దాదాపు 15 ఏళ్ల తర్వాత కొడుకు సూర్య(సాయి ధరమ్ తేజ్)తో కలిసి వస్తుంది ఓ తల్లి. అదే ఊరి అమ్మాయి నందిని (సంయుక్తా మీనన్)తో లవ్‌లో పడతాడు సూర్య. మరోవైపు, ఆ ఊరిలో అకాల మరణాలు సంభవిస్తుంటాయ్. అంతుపట్టని ఆ మరణాలకు కారణమేంటీ.? అసలెందుకు ఒకరి తర్వాత ఒకరుగా ఆ ఊరిలో జనం చనిపోతున్నారు.? అనే మిస్టరీని చేధించే ప్రయత్నంలో హీరో వుంటాడు. మరి, ఆ చావులకి కారణమేంటీ.? అసలు రుద్రవనంలో ఏం జరిగింది.? హీరో ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు.? అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు:
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కెరీర్ కంప్లీట్‌గా స్పాయిల్ అయిపోయిందన్న అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు. కానీ, ఆ అభిప్రాయాలకు చెల్లు చీటీ పాడేస్తూ, చాలా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు ‘విరూపాక్ష’ సినిమాలో తేజు. తేజు గత చిత్రాలన్నీ ఓ ఎత్తు. ‘విరూపాక్ష’ ఇంకో ఎత్తు అనేలా ప్రామిసింగ్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ సంయుక్తా మీనన్‌కి పర్‌ఫామెన్స్ వున్న రోల్ దక్కింది. తనకిచ్చిన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. సునీల్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
సుకుమార్ కథ ఈ సినిమాకి కీలకం. ఆ కథను అద్భుతమైన కథనంతో చాలా చాకచక్యంగా తెరకెక్కించడంలో కొత్త దర్శకుడు కార్తీక్ దండు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా ఓవరాక్షన్‌కి పోకుండా తాను అనుకున్న కథనాన్ని అనుకున్నట్లుగా రెగ్యలర్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమాని తెరపై ఆవిష్కరించడంలో కార్తీక్ దండు నూటికి నూరు మార్కులేయించుకున్నాడు. కథలోని సస్పెన్స్‌ని చివరి వరకూ మెయింటైన్ చేసి ఊహించని విధంగా రివీల్ చేయడం సినిమాకి హైలైట్. ఇలాంటి కథను ఈ ట్రెండ్ జనానికి దగ్గర చేయడానికి ముందుకొచ్చిన నిర్మాతల్ని అభినందించి తీరాలి. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్ అనిపించింది. ముఖ్యంగా సినిమాకి మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. స్కేరీ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దరగొట్టేశాడు అజనీష్ లోక్‌నాధ్. కథనానికి తగ్గట్లుగా టెక్నికల్ టీమ్ పర్‌ఫెక్ట్ అవుట్ పుట్ అందించింది.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
తేజు పర్‌ఫామెన్స్, డైరెక్టర్ పనితనం,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రీ ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్‌లో ట్విస్ట్..
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడా డ్రమటిక్ అనిపించిన అతి కొద్ది సన్నివేశాలు మాత్రమే.
చివరిగా:
‘విరూపాక్ష’.. సరికొత్త మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్..!
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!