టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు..మరో ఇద్దరు అరెస్ట్
- April 21, 2023
తెలంగాణ: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ చెందిన మైసయ్య, జనార్దన్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరు నిందితుల నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అందుకే ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ చేసే కొద్ది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. నిందితుల ఇచ్చిన సమాచారం, వారి ఫోన్ డేటా ఆధారంగా కేసును చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
రేణుక భర్త డాక్య దగ్గర ఏఈ ఏగ్జామ్ పేపర్ ను కొడుకు జనార్దన్ కోసం మైసయ్య రెండు లక్షల రూపాయలను ఇచ్చి కొన్నాడు. తండ్రి, కొడుకులను అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 19 మంది అరెస్ట్ అయ్యారు. .450 మందిని విచారించారు. ఇక ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే సిట్ నుంచి వివరాలు అందించాలని కోర్టును ఆశ్రయించిన ఈడీ..తాజాగా నిందితులను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ లను కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







