బహ్రెయిన్‌లో 3.4 శాతం పెరిగిన నియామకాలు

- April 21, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో 3.4 శాతం పెరిగిన నియామకాలు

బహ్రెయిన్: 2022 నాలుగో త్రైమాసికంలో బహ్రెయిన్‌లో నియామకాలు 3.4% పెరిగాయని LMRA వెల్లడించింది. 2022 క్యూ4లో 163,471 మంది బహ్రెయిన్‌లను నియమించుకున్నారని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ(LMRA) తెలిపింది. ఇది 3.4% ఎక్కువ అని, 2021 Q1 లో 158,029 నియామకాలు జరిగాయని పేర్కొంది. మరోవైపు, Q4లో సంస్థలచే నియమించబడిన విదేశీ కార్మికుల సంఖ్య 9.9% పెరిగి 582,674కి చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం త్రైమాసికంలో 530,159గా ఉంది.  Q4 2022లో మొత్తం 746,145 మంది ఉపాధి పొందారు. ఉపాధిలో పెరుగుదల ఉన్నప్పటికీ, Q4లో జారీ చేయబడిన కొత్త ఉపాధి వర్క్ పర్మిట్లలో 20.2% క్షీణత కనిపించిందని, మొత్తం 50,137 పర్మిట్లలో 40,591 ఎంప్లాయిమెంట్ వర్క్ పర్మిట్‌లు జారీ చేసినట్లు LMRA తెలిపింది. 

BD 558 నెలవారీ వేతనం

Q4 2022లో బహ్రెయిన్ కార్మికుల మధ్యస్థ నెలవారీ వేతనాలు 1.3% పెరిగాయని నివేదిక తెలిపింది. బహ్రెయిన్ కార్మికులు 2022 Q4లో BD 558 సగటు నెలవారీ వేతనం పొందారు. గత సంవత్సరం Q4లో BD 551 మాత్రమే పొందారు. ప్రైవేట్ రంగంలో బహ్రెయిన్ కార్మికుల మధ్యస్థ నెలవారీ వేతనం BD 464గా ఉంది.  ఇది మునుపటి సంవత్సరం కంటే 1.8% పెరిగింది. అయితే ప్రభుత్వ రంగంలో బహ్రెయిన్ కార్మికుల సగటు వేతనం BD 733, ఇది మునుపటి కంటే 1.9% పెరుగుదలను నమోదు చేసిందని.. నిర్మాణ, వాణిజ్యం, హోటళ్లు,  రెస్టారెంట్లు, చిన్న తరహా తయారీలో బహ్రెయిన్ , నాన్-బహ్రెయిన్ కార్మికుల మధ్య కార్మిక వ్యయ వ్యత్యాసం BD 355, ఇది సంవత్సరం క్రితం త్రైమాసికంతో పోలిస్తే BD21 పెరుగుదల నమోదైందని LMRA తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com