‘కింగ్డమ్ టూర్ 2023’ని ఆవిష్కరించిన జీఈఏ చీఫ్ అల్-షేక్
- April 23, 2023
రియాద్: వచ్చే మే నెలలో జరగబోయే సంగీత నాటకాలు, స్థానిక/అరబ్ కళాకారుల కచేరీల వివరాలతో కూడిన "కింగ్డమ్ టూర్ 2023" క్యాలెండర్‌ను జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ తుర్కీ అల్-షేక్ ఆవిష్కరించారు. తైఫ్, ఖాసిమ్, అభా, రియాద్, హైల్, జజాన్, అల్-బహా, తబుక్ నగరాల్లో ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈవెంట్లు మే నుండి సెప్టెంబర్ వరకు జరుగుతాయి.మ్యూజిక్ కమిషన్, థియేటర్-పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కమిషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రోగ్రామ్ మరియు విజిట్ సౌదీ సహకారంతో ఉంటాయన్నారు. కళాకారుల జాబితాలో మహ్మద్ అబ్దో, రబా సఖర్, అసలా, ఖలీద్ అబ్దుల్ రెహమాన్, ఫహద్ అల్-కుబైసీ, అసీల్ అబూ బకర్, జినా ఇమాద్ మరియు రాజ్యం, గల్ఫ్ -అరబ్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది ప్రముఖ కళాకారులు ఉన్నారు. నాటకాలలో ష్రెక్ ది మ్యూజికల్, ది ఫ్లైట్, దట్ లైక్స్, మిస్ఫర్ ది సీఈఓ, లండన్ అపార్ట్మెంట్, రూమ్ ఆఫ్ 13, వరల్డ్ వార్ VI, హడి వాలెంటైన్, మెమో మరియు టూ ది మూన్ ఉన్నాయి. కింగ్డమ్ టూర్ 2023 నాటకాలలో ఈజిప్ట్, కువైట్ నుండి అగ్రశ్రేణి కళాకారులు పాల్గొంటారు. వారిలో అహ్మద్ హెల్మీ, బయౌమి ఫౌద్, అహ్మద్ అల్-ఔనన్, హోడా హుస్సేన్, అబ్దెల్ మజీద్ అల్-రహిది మరియు తారిక్ అల్-అలీ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







