నార్త్ అల్ బతినాలో అగ్నిప్రమాదం

- April 24, 2023 , by Maagulf
నార్త్ అల్ బతినాలో అగ్నిప్రమాదం

మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఒకరు గాయపడినట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ బృందాలు.. సోహార్ విలాయత్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదాన్ని జరిగిన సమాచారాన్ని అందుకొని సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి అత్యవసర వైద్య సంరక్షణ అందించేందుకు వీలుగా సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సిడిఎఎ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com