పబ్లిక్, కమ్యూనిటీ సంక్షేమ సంస్థలకు గుడ్ న్యూస్

- April 24, 2023 , by Maagulf
పబ్లిక్, కమ్యూనిటీ సంక్షేమ సంస్థలకు గుడ్ న్యూస్

యూఏఈ: ప్రజా,  కమ్యూనిటీ సంక్షేమానికి దోహదపడే సంస్థలను కార్పొరేట్ పన్ను నుండి మినహాయించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఈ సంవత్సరం అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రజా సంక్షేమం, దాతృత్వం, కమ్యూనిటీ సర్వీసెస్ లేదా కార్పొరేట్, సామాజిక బాధ్యతపై దృష్టి సారించిన కంపెనీలు కార్పొరేట్ పన్ను నుండి మినహాయించబడతాయని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యూఏఈ గత సంవత్సరం Dh375,000 అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న కంపెనీలు, ఫ్రీలాన్సర్‌లపై తొమ్మిది శాతం కార్పొరేట్ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు యూఏఈ కార్పొరేట్ పన్ను ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, మినహాయింపుకు అర్హత పొందేందుకు, ఈ సంస్థలు తప్పనిసరిగా కార్పొరేట్ పన్ను చట్టంలోని ఆర్టికల్ (9)లోని షరతులను తప్పక పాటించాలని, అవి అన్ని సంబంధిత సమాఖ్య, స్థానిక చట్టాలకు అనుగుణంగా కొనసాగాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com