పాలస్తీనాలో భారత మొదటి మహిళా ప్రతినిధిగా రేణు యాదవ్

- April 24, 2023 , by Maagulf
పాలస్తీనాలో భారత మొదటి మహిళా ప్రతినిధిగా రేణు యాదవ్

బహ్రెయిన్: గతంలో బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీగా పనిచేసిన రేణు యాదవ్ పాలస్తీనా రాష్ట్రానికి కొత్త ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. నిన్న జరిగిన సమావేశంలో పాలస్తీనా విదేశాంగ మంత్రి డాక్టర్ రియాద్ అల్-మల్కీకి రేణుయాదవ్ భారతదేశ ప్రతినిధిగా (డిసిగ్నేట్) తన ఆధారాలను సమర్పించారు. 2013లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో రేణు యాదవ్ చేరారు. కైరోలోని భారత రాయబార కార్యాలయంలో రేణుయాదవ్‌ తొలి నియామకాన్ని పొందారు. రాయబార కార్యాలయంలో విధులతో పాటు ఆమె అమెరికన్ యూనివర్సిటీ, కైరో నుండి అరబిక్ భాషలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా చేశారు. ఆ తర్వాత బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీ/ఫస్ట్ సెక్రటరీగా, పరిపాలన, మీడియా, విద్య మరియు రాజకీయ కార్యకలాపాలను నిర్వహించింది. రేణుయాదవ్ భారతదేశంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్చిమ ఆసియా,  ఉత్తర ఆఫ్రికా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, జిబౌటీలకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించారు. ఆమె నియామకం భారతదేశం - పాలస్తీనా మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com