గాల్లో అమెరికన్ విమానం ఇంజన్ లో మంటలు..
- April 24, 2023
అమెరికా: గాల్లో అమెరికన్ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగడం తో ప్రయాణికులు భయంతో వణిపోయారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫీనిక్స్ గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమానం సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓహియో విమానాశ్రయం నుంచి ఆదివారం బోయింగ్ 737 ఫ్లైట్ ఒకటి ఫినిక్స్ కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ సందర్భంగా విమానం ఇంజన్ లో మంటలు రేగడంతో ఫ్లైట్ ను తిరిగి ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఓహియోలోని జాన్ గ్లెన్ కొలంబస్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యేంత వరకూ ఇతర విమానాల రాకపోకలను నిలిపేశారు. రన్ వే పై ఎమర్జెన్సీ సిబ్బందిని, ఫైర్ ఇంజన్లను మోహరించారు. ఫ్లైట్ ల్యాండయిన వెంటనే మంటలను ఆర్పేశారు.
ఆకాశంలో విమానం ఇంజన్ కు నిప్పంటుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









