హారర్ ఫ్యాక్టర్ ‘విరూపాక్ష’కి ప్లస్సా.? మైనస్సా.?

- April 24, 2023 , by Maagulf
హారర్ ఫ్యాక్టర్ ‘విరూపాక్ష’కి ప్లస్సా.? మైనస్సా.?

కొన్ని సినిమాలు ఎందుకు హిట్టవుతాయో అస్సలు తెలీదు. ఎంటర్‌టై‌న్‌మెంట్ వుంటేనే ఏ సినిమా అయినా హిట్టవుతుంది అని కూడా అనుకోలేం. అస్సలేమాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ లేని సినిమాలు కూడా ఒక్కోసారి సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయ్. 

అలాంటి కోవలోకి చేరేదే తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విరూపాక్ష’. అస్సలు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. కంప్లీట్ సీరియస్ మూవీ. హారర్ ఫ్యాక్టర్ మూవీ. అయినా కానీ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు ప్రేక్షకులు. 

రెండో వారం గడిచినా ఈ సినిమాకి జనం పోటెత్తుతున్నారు. హౌస్ ఫుల్ బోర్డులతో ధియేటర్లు కళకళలాడుతున్నాయ్. హారర్ ఫ్యాక్టర్ అనే బేస్‌తో పిల్లలు ఈ సినిమా చూసేందుకు కాస్త వెనుకాడుతున్నారనే అపోహ వున్నప్పటికీ, అదే ఫ్యాక్టర్ ఈ సినిమాని సక్సెస్ అయ్యేలా చేసిందన్న టాక్ మరోవైపు వుంది. 

ఏది ఏమైనా యాక్సిడెంట్ తర్వాత ఓ సీరియస్ మూవీతో సాయి ధరమ్ తేజ్ ఇంత పెద్ద హిట్ కొట్టడం నిజంగా విశేషమే. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ‘విరూపాక్ష’ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మేనియా ఎన్ని రోజులుంటుందో చూడాలి మరి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com