దుబాయ్ భవనం అగ్నిప్రమాదం: అద్దెదారుల ప్రవేశంపై కొనసాగుతున్న సందిగ్ధత
- April 24, 2023
దుబాయ్: దేరా లోని అగ్నిప్రమాదానికి గురైన భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని వాణిజ్య సంస్థలను ఈద్ అల్ ఫితర్ పండుగకు రెండు రోజుల ముందు నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. కాగా, నివాస యూనిట్ల తెరవడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ప్రస్తుతానికి నిర్వహణ కార్మికులు తప్ప ఎవరూ భవనంలోకి ప్రవేశించడానికి అధికారులు అనుమతించడం లేదు. ఏప్రిల్ 15న అల్ రాస్‌లోని ఒక భవనంలోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయి. నివాస భవనంలో చెలరేగిన భారీ మంటల కారణంగా 16 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. భవన భద్రత, భద్రతా అవసరాలకు అనుగుణంగా లేకపోవడం అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి గల కారణాలపై వివరణాత్మక నివేదికను అందించడానికి అధికారులు సమగ్ర విచారణను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







