పద్మ పురస్కారాల ప్రక్రియ ప్రారంభం
- May 09, 2016
పద్మ పురస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది. 2017 ఏడాదికి గాను వివిధ రంగాల్లో అత్యుతన్న సేవలందించిన వారికి పద్మ పురస్కారాలతో గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. నామినేషన్లు పంపేందుకు 15 సెప్టెంబర్, 2016 చివరి తేదీ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. www.padmaawards.gov.in వెబ్‌సైట్ ద్వారా పంపిన ప్రతిపాదనలు మాత్రమే ఆమోదిస్తారని పేర్కొంది. ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్లో పొందుపర్చినట్లు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారతరత్న, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన వారు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలు అవార్డులకు సిఫార్సు చేయవచ్చు. ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీ నామినేషన్లు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. 2017కు గాను వచ్చే ఏడాది జనవరి 25న పద్మ పురస్కార గ్రహీతల పేర్లు వెల్లడిస్తారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







