టీజీఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్: విజేతగా నిలిచిన ‘వీర తెలంగాణ జట్టు’
- April 25, 2023
దోహా: ఏపీఎల్ మైదానంలో జరిగిన తెలంగాణ గల్ఫ్ సమితి(TGS) ప్రీమియర్ లీగ్ సీజన్ - 08 క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ ఫినాలేలో క్యూఎన్‌టీఓపై వీర తెలంగాణ జట్టు విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకుంది. అల్ తుమ్మా గ్రౌండ్‌లో నిర్వహించిన బహుమతుల పంపిణీ కార్యక్రమంలో టీజీఎస్ ప్రధాన కార్యదర్శి సాయిగిరి వంశీ పాల్గొని మాట్లాడారు. టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేసిన ఏపీఎల్, TGS స్పోర్ట్ ఇన్‌చార్జి మహేందర్, TGS PRO సంజు థామస్, TGS MC టీమ్ సభ్యులు, స్పాన్సర్‌లు, వాలంటీర్‌లు, కమ్యూనిటీ నాయకులకు.. ఇతర మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు.
టీజీఎస్ అనేది ఇండియన్ ఎంబసీ ఖతార్ ఆధ్వర్యంలో అపెక్స్ బాడీ ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ అనుబంధ సంస్థ అని, ఇది ప్రధానంగా బ్లూ కాలర్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రీమియర్ లీగ్ ను బ్లూ కాలర్ వర్కర్లు పనిఒత్తిడి నుంచి దూరంగా రిఫ్రెష్ కావడానికి కొంత సమయాన్ని అందించే నిర్దిష్ట లక్ష్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అవార్డు ప్రదానోత్సవం వేడుకలో సీనియర్ సంఘం నాయకుడు కేఎస్ ప్రసాద్, ICBF షానవాస్ బావా జీ, ICBF వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి జీ, ISC కమిటీ సభ్యుడు సి.దీపక్, తెలుగు కళా సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన డి. హరీష్ రెడ్డి, ICBF కమిటీ మెంబర్ శంకర్ గౌడ్, తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రఫిక్ జీ తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!









