60 దిర్హామ్‌ల కోసం ఘర్షణ.. స్వదేశీయుడిని పొడిచిచంపిన ఆసియా వ్యక్తి

- April 25, 2023 , by Maagulf
60 దిర్హామ్‌ల కోసం ఘర్షణ.. స్వదేశీయుడిని పొడిచిచంపిన ఆసియా వ్యక్తి

దుబాయ్: 60 దిర్హామ్‌ల కోసం జరిగిన ఘర్షణలో తన దేశానికే చెందిన వ్యక్తిని కత్తితో పొడిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల ఆసియా జాతీయుడిపై హత్య కేసును దుబాయ్ క్రిమినల్ కోర్టు విచారిస్తోంది. పోలీసుల విచారణ ప్రకారం.. అల్ రిఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై.. రక్తపు మడుగులో పడిఉన్నాడని  అల్-రిఫా పోలీస్ స్టేషన్ కు సమాచారం వచ్చింది. వెంటనే CID బృందాలు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని మూడు గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.దీంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు కేసును రిఫర్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com