సౌదీలో మెడికల్ ప్రాక్టిషనర్స్ కు బీమా అమలు
- April 25, 2023
రియాద్: మెడికల్ ప్రాక్టిషనర్స్ కు వైద్యపరమైన తప్పనిసరి బీమా అమలులోకి వచ్చింది. ఇది అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సందర్భంగా నవంబర్ 2022లో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని అమలు చేస్తున్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం.. నర్సింగ్, ఫార్మసీ, అనస్థీషియా, మిడ్‌వైఫరీ, లాబొరేటరీలు, డయాగ్నోస్టిక్ రేడియాలజీ, అంబులెన్స్ (అత్యవసర వైద్య సేవలు), ఫిజియోథెరపీ, స్పీచ్, కమ్యూనికేషన్, శ్వాసకోశ చికిత్స, పోషణ (ఇంట్రావీనస్ థెరప్యూటిక్ న్యూట్రిషన్), కార్డియాలజీ, ఆడియాలజీ, బోన్ సెట్టింగ్ , రక్తం, ఆప్టిక్స్, ఆపరేషన్ గది సాంకేతిక నిపుణులకు బీమా సౌకర్యం అమల్లోకి వచ్చింది. మరోవైపు సౌదీ అరేబియాలోని వైద్య వివాదాల ప్యానెల్‌ల అధికార పరిధిని న్యాయ మంత్రిత్వ శాఖ (MoJ) కింద సాధారణ న్యాయవ్యవస్థకు బదిలీ చేశారు. ఈ మేరకు న్యాయ - ఆరోగ్య మంత్రిత్వ శాఖల మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









