కేరళలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- April 25, 2023
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. రైలులోని ఓ కోచ్ లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ వందే భారత్ రైలు తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వరకు ప్రయాణించనుంది. ఈ రైలు కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ 11 జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయ్ విజయన్, రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్నారు. అంతకుముందు రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోడీ . కేరళ అభివృద్ధి చెందితే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది దేశీయంగా తయారు చేయబడిన సెమీ-హై-స్పీడ్ రైలు. ఈ రైలు అత్యాధునికమైన ప్రయాణీకుల సౌకర్యాలను అందిస్తోంది. ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. మోడీ కేరళ పర్యటనలో అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోడీపై ఎప్పుడూ విమర్శలు చేసే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. మోడీ కూడా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







