హైదరాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీస్ కీలక నిర్ణయం..
- April 25, 2023
హైదరాబాద్: పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (PSKs), పాస్‌పోర్టు ఆఫీస్ సేవా కేంద్రాల్లో (POSKs) కొత్త పాస్‌పోర్టుల కోసం, పాస్‌పోర్టుల రెన్యువల్ కోసం వచ్చే వినియోగదారులు గంటల తరబడి ఎదురుచూసే పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించేందుకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి రెండు వారాలపాటు ఎప్పుడూ ఇచ్చే రోజువారీ పాస్‌పోర్టు అప్పాయింట్‌మెంట్స్‌కు అదనంగా.. మరో 500 అప్పాయింట్‌మెంట్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం హెడ్ దాసరి బాలయ్య ఇవాళ ఒక ప్రకటన చేశారు. ఏప్రిల్ 27కు సంబంధించిన 500 అదనపు అప్పాయింట్‌మెంట్స్.. పాస్‌పోర్టు సేవా వెబ్‌సైట్‌లో ఇవాళ (ఏప్రిల్ 25) సాయంత్రం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పాస్‌పోర్టు ఆఫీస్ సేవా కేంద్రాలను మూసి ఉంచారు. దాంతో ఆ రోజు అప్పాయింట్‌మెంట్స్ తీసుకున్నవారు సేవలను పొందలేకపోయారు.
పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో వినియోగదారుల రద్దీ భారీగా పెరగడానికి ఇది కూడా ఒక కారణమయ్యింది. కాబట్టి ఇప్పటికే పాస్‌పోర్టుల కోసం రిజిస్టర్ చేసుకున్నవాళ్లు, చేసుకుంటున్న వాళ్లు ఈ అదనపు 500 అప్పాయింట్‌మెంట్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దాసరి బాలయ్య కోరారు. http://www.passportindia.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా http://mPassportseva మొబైల్ అప్లికేషన్ ద్వారా లేదా PSKs, POSKs లను నేరుగా సంప్రతించడం ద్వారా అదనపు 500 అప్పాయింట్‌మెంట్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!
- వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!









