నిద్రలేమికి కారణమైన ఈ హార్మోన్ గురించి మీకు తెలుసా.?
- April 26, 2023హార్మోన్ల అసమతుల్యత కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు చూస్తుంటాం. ఊబకాయం రావడం, లేదంటే బాగా బక్క చిక్కి పోవడం. నిద్రలేమి, ఒత్తిడి, బాగా ఆకలి వేయడం, లేదా ఆకలి మందగించడం.. ఇలా ఒక్కటేమిటి అనేక రకాల సమస్యలు హార్మోన్ల అసమతుల్యత వల్లే తలెత్తుతుంది.
ముఖ్యంగా కార్టినాల్ అనే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అతిగా ఆకలి వేయడం, నిద్రలేమి తదితర సమస్యలు తలెత్తుతాయనీ తాజాగా ఓ సర్వే ద్వారా తెలిసింది.
ఈ హార్మోన్ శరీరానికీ, మనసుకీ అనుసంధాన కర్తగా పని చేస్తుందట. కార్టిసాల్ సమతుల్యంగా వున్నప్పుడు రోజంతా యాక్టివ్‌గా పని చేస్తారట. ఈ హార్మోన్ అసమతుల్యత వల్ల నిస్సత్తువ ఆవహిస్తుందట. తద్వారా అధికంగా ఆకలి వేసినట్లుంటుందట. నిద్రలేమితోనూ బాధపడతారట. అధికంగా ఒత్తిడి ఫీలవుతారట.
ఈ హర్మోన్ స్థాయిని సమతుల్యంగా వుంచాలంటే, శారీరక శ్రమ వుండాలనీ నిపుణులు చెబుతున్నారు. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదనీ, రోజువారీ వ్యాయామం, కాసేపు మనసు లగ్నం చేసి యోగా చేస్తే సరిపోతుందట. సైక్లింగ్, జాగింగ్ ద్వారా ఈ హార్మోన్ బ్యాలెన్సెడ్‌గా వుంటుందని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ