సబా అల్-అహ్మద్ ప్రాంతంలో సింహం పిల్ల హల్చల్

- April 27, 2023 , by Maagulf
సబా అల్-అహ్మద్ ప్రాంతంలో సింహం పిల్ల హల్చల్

కువైట్: సబా అల్-అహ్మద్ ప్రాంతంలో ఓ సింహం పిల్ల స్వేచ్ఛగా తిరగడం కలకలం రేపింది. ఈ సంఘటన స్థానికులలో భయాన్ని కలిగించింది. కాగా, అంతర్గత మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సెంటర్ కు సమాచారం అందగానే.. పోలీసులు, ప్రజా భద్రత, ట్రాఫిక్ పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సింహం పిల్లను బంధించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  సింహం పిల్ల ఆ ప్రాంతంలోని దానిని పెంచుకుంటున్న యజమాని ఇంటి నుండి తప్పించుకుని వీధిలో స్వేచ్ఛగా తిరిగుతూ ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసిందని పేర్కొంది. క్రూర జంతువులను ఇండ్లలో పెంచటం చట్టవిరుద్ధం అని, సింహం పిల్ల యజమాని కోసం వెతుకుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com