శిశువుకు ఆపరేషన్ లేకుండా చికిత్స అందించిన మెడికవర్ వైద్యులు

- April 27, 2023 , by Maagulf
శిశువుకు ఆపరేషన్ లేకుండా చికిత్స అందించిన మెడికవర్ వైద్యులు

హైదరాబాద్: సోమాలియా కి చెందిన ముస్తల్ఫా అబ్రిస్క్ అహ్మద్ అనే 11  నెలల పాప ఏడు కిలోల బరువుతో ఉన్నది. ఈ పాప గుండెలో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (VSD) అని పిలవబడే రంధ్రంతో బాధపడుతున్నది. పాప తల్లి దండ్రులు ఆమెని వాళ్ళ దేశంలో మరియు మన దేశంలో వేరే హాస్పిటల్స్ లో చూపించారు. అక్కడ వారు ఈ పాపకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండె రంద్రం పూడ్చాలని సూచించారు. అప్పుడు వారికి మెడికవర్ హాస్పిటల్స్ లోనే పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ సప్రె గురించి తెలుసుకొని మెడికవర్ హాస్పిటల్స్ కి  రావడం జరిగింది. పాపని పరీక్షించిన డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే పాపకి కోత మరియు గాయం మనటానికి హాస్పిటల్ లో ఎక్కువ రోజులు మరియు ఉండవలసి వస్తుంది మరియు చిన్న వయసు కాబట్టి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి అని కోత లేకుండా గుండె ప్రొసీజర్ నిర్వహించి రంద్రాన్ని పూడ్చడం జరిగింది.

అనంతరం డాక్టర్ ఆశిష్ సప్రె మాట్లాడుతూ ఇది సాధారణ పుట్టుకతో వచ్చే గుండె సమస్య . వయసు రీత్యా చిన్న పాప వల్లన చాలా మంది డాక్టర్స్ వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు. కానీ మేము కూడా పాప చిన్న వయసు కారణంగా అందుకు బిన్నంగా ప్రొసీజర్ నిర్వహించి కోత కుట్లు లేకుండా VSD పరికరం అమర్చి రంద్రాన్ని పూడ్చాలని నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని పాప తల్లితండ్రి కి చెప్పడం వారు అంగీకరించడం జరిగింది. VSD డివైస్ క్లోజర్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. శిశువు కోలుకోవడం మరియు ఆరోగ్యంగా ఉన్నది. పాప తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు.

అనంతరం సెంటర్ హెడ్ మాత ప్రసాద్ మాట్లాడుతూ  అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యంత అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు మరియు పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ బృందంచే అత్యాధునిక NICU మరియు PICU సౌకర్యాలను కలిగి ఉంది.

పాప తల్లిదండ్రులు తమ బిడ్డకు కొత్త జీవితాన్ని అందించినందుకు వైద్యులకు మరియు ఆసుపత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com